వయోవృద్ధ తాబేలు శరీరము యొక్క పై భాగమున నుండు కవచమును, చిరుత్రాచును,
మరియు బాగా ఏపుగా పెరిగిన పంది యొక్క కొమ్ములను ఆభరణములుగా ధరించి,
మాంసము కొంచెమును కూడా కానరాక నున్నగా ఉన్న కపాలమున ఆహారమును అర్థించు ఆతడు నా మదిని దోచిన దొంగ.
గొప్పగా చదువుకొని, ఉపన్యాసములను విని జ్నానమును సముపార్జించి,
మంచితనముతో నిండిన వ్యక్తులు తమ రెండు చేతులను జోడించి ఎల్లపుడూ ఆతని గొప్పదనమును స్తుతించెదరు.
[ అనువాదము: సశికళ దివాకర్.2009 ]