ఎర్రని హస్తమున దుముకుతున్న పసి జింకను పట్టుకొని, అనునిత్యము,
చీల్చబడ్డ నాసికములు గల బాతులు తమ ఆహారమైన చిరు చేపల కొరకు చిన్న చిన్న గుంతలలో అటునిటు కదలాడుతున్న
ఉద్యానవనములు గల `పుంతర`లో వెలసి యున్న ఓ నాథా!
దయచేసి అమితవేగముతో క్రిందకు దుమికి, విశ్వమంతటా వ్యాపించగల ఆ పవిత్ర గంగా జలమును నీ అదుపులో ఉంచుకొని,
ఎర్రని నీ కేశముల యందు బందించి ఉంచుటకు గల కారణమును మాకు తెలియచేయుము.
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]