అర్ధనారీశ్వరుడవై, వేదాలను ఒక వైపు వల్లిస్తూనే, కుడివైపు గండ్రగొడ్డలిని ధరించిన శివా! పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణెయ్నల్లూర్ అరుళ్తురై కోవిలలోఉండే సౌందర్య మూర్తీ!
చేతులు జోడించి పూజించే వారి బాధలను పోగొట్టాడమే నీ పని గదయ్యా! (కాబట్టి)
నీ అంతట నీవే నీ ఆశ్రిత వర్గం లోనికి నన్ననుమతించవయ్యా! అది తెలిసికోకుండా, గతం నుంచీ నీకు నే దాసుడినై ఉన్నందున నీ సేవకుడిని కాదని ఇప్పుడు విరుద్ధంగా వాదించడంనాకు సరికాదేమో ?
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)