బంగారం , వజ్రాలు, తదితర అమూల్య రత్నాలను దొర్లించుకొని వచ్చే అలలతో ఇరు తీరాలను తాకుతూ, కాంతివంతంగా ప్రవహించే పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణెయ్నల్లూర్ అరుళ్తురై కోవిలలో తల్లి లా దయచూపే ప్రభూ ! శివా!
మరుపులేకుండా మనస్సులో నిన్నెప్పుడూ ధ్యానిస్తూనే ఉంటాను.
చిర కాలం నుండి నీ దాసుడను కాదని ఇప్పుడు వాదించడం నాకు సరికాదేమో ?
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)