ప్రఖ్యాతినొందిన జఠముడులు కలవాడా! వృషభమునధిరోహించి వచ్చువాడా! నిరంతరముగ వరములను
పొందగలుగు స్థలముగ పేరొందిన తిరువలంచుళియిల్ నందు వెలసిన మా తండ్రీ! బ్రహ్మ, విష్ణువు మున్నగువారిచే
కొలవబడలేనటువంటి రూపము కలవాడా! నీవు కపాలమునందు స్వీకరించు
భిక్షను గొప్ప సంపదగా భావించుటయందలి కారణమేమిటో? దయచేసి మాకు తెలియజేయుము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]