తీరములన్నియునూ నిండిపోయినట్లు, గుంతలలో సహితం పూసిన కలువ పుష్పములతో ఆ ప్రాంతమంతా నిండియుండుటచే
అచ్చటి జలము, కలువ పుష్పముల యొక్క సువాసనను వెదజల్లుచున్న తిరువలంచుళియిల్ నందు,
విరాజిల్లుటకు అన్ని అర్హతలు కలవాడా! చిన్న పసి జింకను హస్తమునందుంచుకొనినవాడా!
సమస్త జనులందరికీ తెలియునట్లు కపాలమునందు భిక్షను అర్థించుట ఎందులకో? దయచేసి మాకు సెలవిమ్ము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]