పెరిగే నీటిమట్టముతో కూడిన కావేరి నదిలో, పుష్యమి తిథి దినమున, పలు పుష్పముల పరిమళ మిళితమై వచ్చు జలమందు
స్నానమాచరించువారియొక్క కష్టములను తీర్చి, అనుగ్రహించుచూ తిరువలంచుళియిల్ నందు వెలసిన ఈశ్వరా!
అందమైన చిన్న పసి జింకను హస్తమందుంచుకొనువాడా! అనేకులు దూషించిననూ తీవ్రతరమైన వేసవి ఎండలో
భిక్షనర్థించుట సంపద లేకుండట చేతనో!? దయచేసి మాకు తెలియజేయుము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]