సువాసనతో కూడియున్న మేలిమి పుష్పములు, చంధన వృక్షములు, ధూపము కొరకు ఉపయోగించు నల్లని\\\' అకిల్\\\' చెట్లకొమ్మలను కొట్టుకొనుచూ
వచ్చు కావేరీ జలమందు పవిత్ర స్నానమాచరించువారి యొక్క కష్టములను తీర్చుచూ తిరువలంచుళియిల్ నందు వెలసి అనుగ్రహించుచున్న,
విశ్వమునకు ఆది, నడుమ, అంతములు నీవై విరాజిల్లు భగవంతుడా! ఈ విశ్వమునందలి భౌతిక విషయములను ఆశించు
సాధారణ జనులవలే జీవించక, భిక్షనర్థించుట ఎందులకో! దయచేసి మాకు సెలవిమ్ము!
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2011]