వయోవృద్ధ తాబేలు కవచమును, చిరుత్రాచును, ఏపుగా పెరిగిన వరాహ కొమ్ములను ఆభరణములుగా ధరించి, మాంసమంటక, నున్నగనుండు కపాలమున ఆహారమును అర్థించు ఈశ్వరుడు, నా మది చోరగొన్న, మానసచోరుడు!!. గొప్ప వేదములు పఠించి, ఉపన్యాసములను విని, జ్ఞానం సముపార్జించి, మంచితనంతో నిండిన వ్యక్తులు తమ కరములను జోడించి, ఎల్లపుడూ ఆతని గొప్పదనమును స్తుతించెదరు!.
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009