తెల్లని, స్వచ్చమైన వెలుగును ప్రసరింపజేయు నెలవంకను శిరస్సుపై ధరించి,
బంగారపు వన్నెతో ధగధగ మెరుస్తూ క్రిందకు వ్రేలాడు జఠలనుండి జలం ధారగా కారుచుండ, ఆ చెలికాడు నా మనసును దోచి, నేను ధరించిన తెల్లని మరియు అన్యవర్ణ హస్తాభరణములను, చిక్కిన నాచేతినుండి జారునట్లు చేసాడు!.ఈతడు బ్రహ్మపురమున వేంచేసి, ఆ స్థానంను విశ్మమంతటికీ బీజంగా నెలకొల్పి, దానికి అనేక పవిత్ర స్ఠానములను అనుసంధానంజేసి, మిక్కిలి పేరుప్రఖ్యాతులు పొందుతున్నవాడే!
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009