బంగారం, వెండి మరియు ఇనుముతో చేయబడిన త్రిపురములను, తన వాడి బాణమును ఆకాశమున ధగ ధగ మెరిపిస్తూ కొల్లగొట్టడమేకాక, కరమందు బ్రహ్మకపాలముంచుకుని నానుండి భిక్షను గైకొని, నా మనసును దోచిన వాడు!. పర్వతంవంటి విశాలమైన ఆ వక్షస్థలమున కొండ్రై పుష్పములను, చీమల పుట్టలు స్థావరంగనుండు త్రాచులను ధరించియుండును!. ఈతడు అమ్మవారిని హృదయంన స్థిరంగా నిలుపుకుని ఆనందంగా బ్రహ్మపురమున వెలసియున్న ఆ పరమేశ్వరుడే!
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009