నా స్నేహితుల సంభాషణద్వారా తెలిసినట్లుగనే, సుందర రూపుడైన ఆ పరమేశ్వరుడు, తన మేనుయందర్థభాగమున స్త్రీరూపంను దాల్చి, అల్లిన జఠలవంటి కేశములుకల్గి, వృషభవాహనారూఢుడై, అరుదెంచి నా మనసును దోచుకున్నవాడే!. ప్రళయమున నీలి సముద్రం భూమండలమంతటినీ ఆక్రమించు సమయమున, ఆ నీటిపై తేలియాడుచు నిల్చిన తోణిపురమనబడు బ్రహ్మపురంన ఆహ్లాదంగా వేంచేసియున్నఈశ్వరుడే ఈతడు!. (తమిళమున తోణి అనగా పడవ అని అర్థం)
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009