నారాయణుడూ, తామర పుష్పంపై అమరియుండు బ్రహ్మా, తన ఆది అంతములను కనుగొనదలచి, వరాహ రూపమున పాతాళమందూ, హంసపక్షిగా ఆకాశమందూ వెదకి విఫలమైయుండ, వారికి దివ్యజ్యోతిరూపంలో దర్శనమిచ్చిన నా మానసచోరుడు, విశాల నుదురుగల స్త్రీలు మొదలుకుని, విశ్వమందలి జీవులందరూ ఆరాధించుచుండ వారిననుగ్రహించ బ్రహ్మపురమందు వెలసియున్న ఆ పరమేశ్వరుడు కాదా!?
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009