విష్ణువు, చతుర్ముఖుడు, ఆదిదేవుని దర్శించాలని భావించారు. విష్ణువు భూమివైపు పయనించి అన్వేషించి విఫలమనోరథుడయ్యాడు. బ్రహ్మ ఊర్థ్వముఖుడై వెతికి వైఫల్యం చెందాడు. ఎత్తైన భవనాలతో విలసిల్లే చిదంబరక్షేత్రంలో ఆవాసమున్న నటరాజు దివ్యచరణాలను భక్తితో స్మరించినవారికి అతడు గోచరిస్తాడు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024