మధురంగా మాట్లాడి పార్వతీదేవిని తన వామభాగాన నిలుపుకున్నవాడు. విరామం లేకుండా ప్రపంచాలను సృజించి, రక్షించి, లయంచేసే ప్రతిభావంతుడు చిదంబరంలో వెలసి ఉన్నాడు. ఆ పరమశివుని ఆవాసమైన కైలాసపర్వతాన్ని భుజబలదర్పంతో రావణుడు కదిలించాడు. అతడి పదితలలను బాధకు లోనుచేసిన పరమశివుని పాదాలను ఆశ్రయించి అర్చించండి.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024