ఆగామి కర్మలు, అనుభవించవలసిన ప్రారబ్ధకర్మలు ద్వంద్వాలైన (పాపపుణ్యకర్మలు) సంచితకర్మలు నాకు ఎటువంటి దుఃఖాన్ని కలుగజెయ్యగలవు? చిదంబర క్షేత్రంలో దివ్యనాట్యం సలుపుతున్న పరమశివునిపై అపరిమిత భక్తికలిగిన దాసుడను నేను. నాపై కర్మలేవీ దుష్ప్రభావాన్ని చూపలేవు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024