జ్ఞానులు, దేవతలు దర్శించి వరాలను పొందగల మహోన్నత మహిమ గలది చిదంబరక్షేత్రం. శిష్టులైన బ్రాహ్మణులు జీవించడానికి యోగ్యమైన దివ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో దివ్యనాట్యం సలిపి అనుగ్రహిస్తున్న జ్ఞానమూర్తియైన శివుని దివ్యచరణాలను కైమోడ్చి అర్పించే జ్ఞానులను - ఇతర ప్రాణాలను హరించగల యముడు సమీపించలేడు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024