నేననే అహంకారం కలిగిన బ్రహ్మవిష్ణువులు దర్శించలేని అనంతంగా సాగిన అగ్ని (జ్యోతి) స్తంభాకృతి దాల్చినవాడు. మకరందం స్రవించే పరిమళభరిత పుష్పవనాలు పరివేష్టించిన తిల్లైయంబలంలో కొలువున్న చిదంబరనాధుడు పంచకృత్యనాట్యం చేస్తుంటాడు. బ్రహ్మవిష్ణువులు దర్శించలేని పరముని భక్తితో అర్చించిన వ్యాఘ్రపాద, పతంజలులు దర్శించారు. వాళ్ళకు సాక్షాత్కరించడమే కాక తన స్వభావాన్ని స్పష్టపరచి పరమానందాన్ని అనుగ్రహించాడు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024