నల్లటి శరీరకాంతి కలవాడు; ఎర్రటి కళ్ళున్నవాడైన విష్ణుమూర్తి, దివ్యచరణాలను పరిమళం వెదజల్లే ఎర్ర తామరలో ఆసీనుడైన బ్రహ్మ శిరస్సును అన్వేషించి దర్శించలేని విధంగా నిటారైన అగ్నిస్తంభంలా జ్వలించిన తేజస్సున్నవాడు; మనస్సులోని మోహాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతి అయినవాడు; విపులమైన పృథ్వి, ఆకాశం దేవలోకం మొదలైన సప్తలోకాలను దాటి వ్యాపిస్తూ అనంతమైన మహాజ్యోతి స్తంభమై వెలసినవాడు - ఇటువంటి వ్యాఘ్రపురవాసుని స్తుతించని రోజు నిరుపయోగమే.
(వ్యాఘ్రపాదమహర్షికి గొప్ప ఆశ్రయంగా ఉన్నందున పెరుమ్‌పట్రాపులియూర్ అని తమిళంలో పేర్కొన్నచోట వ్యాఘ్రపురిగా అనువదించడం జరిగింది.) 10
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024