సర్వసమర్థుడు. గంగాదేవిని జటలో ధరించినవాడు, ఒకవైపు కావేరీనదిచే ఆవరింపబడిన ‘తిరువలంచుళి’ దివ్యక్షేత్రంలో నెలకొన్నవాడు. సంపదలేనివారిని ఆదరణ లేనివారిని అనుగ్రహించేవాడు. తనకు తానే సాటి అయినవాడు. దేవతలచేత నిరంతరం స్తుతింపబడుతున్నవాడు. తిరువారూరులోను కొలువున్నవాడు. ఆ పరమేశ్వరుడు అందరికంటె శ్రేష్ఠుడు కనుక పరముడైన వ్యాఘ్రపురి వాసుని నోరారకీర్తించని రోజు రోజు కాదు. 2
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024