గజచర్మాన్ని పైవస్త్రంగా బిగియకట్టినవాడు. ధరించిన కంకణాల ధ్వని ఇతర ప్రకృతి ధ్వనులతో కలిసి విన్పిస్తున్నాయి. చేతిలో అగ్నిని ధరించి, ఔన్నత్యాన్ని పెంచే దృఢమైన భుజాలతో శోబిల్లుతున్నవాడు. అర్ధచంద్రుని జడలో దాల్చినవాడు. చక్కటి ప్రకాశవంతమైన ముఖం కలిగిన ఉమాదేవి ప్రియంతో వీక్షిస్తుండగా, దేవతాగణం తలవాల్చి నమస్కరిస్తుండగా దివ్యనాట్యం చేస్తున్న పరమపురుషుని, వ్యాఘ్రపురి నిలయుని కీర్తించని రోజు, లేనిరోజే. 3
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024