తపస్సంపన్నులు అర్చించి కీర్తించే నాయకుడు, దేవతలకు అధిపతి, దుర్మార్గాలను హరించేవాడు, వృద్ధాప్యం కలగనియ్యని అమృతాన్నిచ్చి దేవతలకు సాయం చేసినవాడు, తరంగాలు పైకెగసి, ముడుచుకొని పడేకడలి, ఉన్నతమైన పర్వతం, భూమి, ఆకాశం, స్పష్టమైన కాంతిగల నక్షత్రాలు, అష్టదిక్కులు, ఆకాశంలో చరిస్తున్న సూర్యుడు, మధ్యాహ్నం, సాయం సమయం ఇతరాలైన సర్వవస్తువులలో ఉంటూ, వాటిని ప్రవర్తిల్లజేసే వైభవంకలవాడు - అయిన పులియూర్ (వ్యాఘ్రపురి) వాసుని కీర్తించని రోజు రోజేనా? 4
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024