నిరుపమానుడైన సహచరుడు, భక్తుల దుఃఖాన్ని తొలగించే అమృతసముడు. విస్తారమైన పృథ్విలో జన్మనెత్తిన పిదప వెంటనే ఎదలో ఉద్భవించే సహృదయుడు, బంధువుల సంపదలమీద బంధాన్ని తొలగించి, ఇంద్రియాలమీద ప్రసరించే మనస్సు నణచి, స్త్రీలతో పడకసుఖాన్ని పెకలించి, ఇతర దేవతలను సామాన్యంగా పరిగణించి తనను మాత్రమే ఇష్టపడి ఆరాధించి శరణాగతులైన భక్తులను అన్నివేళలా తోడుగా ఉంటూ సాయపడే వ్యాఘ్రపురి నివాసుని తలవని రోజు నిరర్ధకమే! 5
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024