చెరకువంటి తియ్యటి పలుకులు గల పార్వతీదేవిని తన శరీరంలో వామార్ధభాగంలో ధరించినవాడు, విశిష్టమైన వజ్రపర్వతంవంటి ఆకారం కలవాడు, వికసించే తరుణంలో అంకురమైన వాటితో కట్టిన రేలమాలను ధరించినవాడు (కొండ్రై పుష్పాలని తమిళంలో) చతుర్వేదాలు, అష్టాంగాలు అయినవాడు. తుమ్మెదలు ఇష్టపడే కమ్మని పూలవనాలు నిండిన అందమైన ‘ఆరూర్’ అనే గ్రామంలో పైకెగసే జ్వాలవంటివాడు, నిరంతరం ప్రజ్వరిల్లే అఖండదీపం వంటివాడు, మోక్షానందం మూర్తియై నిలిచినవాడు పరమేశుని భావించి స్తుతించని రోజులన్నీ వ్యర్థమైన రోజులే. 6
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024