సప్తస్వరాలను సంగీత ప్రయోజనంగా నిలిపినవాడు. మేరుపర్వతాన్ని ధనుస్సుగా చేసుకొని, దేవతలను అమ్ములుగా గ్రహించి భయోత్పాతాన్ని కలిగించిన రాక్షసుల త్రిపురాలను బాణప్రయోగంతో భస్మం చేసినవాడు. సముద్రంలో ఉద్భవించిన విషాన్ని మింగినవాడు, తుమ్మెదలు వాలే పూలను ధరించిన కురులున్న యువతుల ఓరచూపులకు చలించని మనస్సున్న తుచ్ఛసుఖనిరోధకులు పొందదగిన లక్ష్యమై నిలిచినవాడు ఇటువంటి వ్యాఘ్రపురాధీశుని కీర్తించనిరోజు వ్యర్థమే. 7
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024