నల్లటి ఏనుగుయొక్క నెత్తురు తడి ఆరని చర్మాన్ని ధరించినవాడు, కోరికలడిగిన వారితో పొలుపారే కాంచీనగరంలోని ఏకంబం (ఏకామ్రం) అనే దివ్యాలయంలో ఆవాసమున్నవాడు, భక్తుల వెన్నంటి ఉన్నవాడు; తమ ప్రయత్నాలచేత గ్రహించాలని భావించే దేవతలకు అందనివాడు. చంద్రలోకవాసులు, ఊర్థ్వలోకవాసులు నమస్కరించే రీతిగా నాట్యాభ్యాసియైన తేజస్స్వరూపుడు, లెక్కలేనన్ని నామాలున్నవాడైన వ్యాఘ్రపురవాసుని స్తుతించనిరోజు నిరుపయోగమే. 8
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024