తెల్లటి అర్ధచంద్రుని దాల్చినవాడు; ముల్లోకాలకు పతి అయినవాడు; శత్రువుల మూడు దుర్గాలను నాశనం చేసినవాడు; వ్యక్తమయ్యే తేజోరూపుడు, సంతోషం కలిగించే పాలు, తేనె వంటివాడు; కుట్రాలమనే దివ్యక్షేత్రంలో వెలసినవాడు; యువకుడు; నృత్యంలో ఘనుడు; అందరికీ నాయకుడు; శివజ్ఞానుల ఎరుకతో గ్రహింపబడినవాడు ఇటువంటి వ్యాఘ్రపుర పరమేశుని కీర్తించని రోజు వ్యర్థమే. 9
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024