విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
ఎనిమిదవ తిరుమురై
76 పది పాటల కూటమి, 1058 పాసురములు
01 తిరువాసహం-సివబురాణం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1
పాసుర సంఖ్య : 1

நமச்சிவாய வாஅழ்க நாதன்தாள் வாழ்க
இமைப்பொழுதும் என்நெஞ்சில் நீங்காதான் தாள்வாழ்க
கோகழி யாண்ட குருமணிதன் தாள்வாழ்க
ஆகம மாகிநின் றண்ணிப்பான் தாள்வாழ்க
ஏகன் அநேகன் இறைவ னடிவாழ்க 5
வேகங் கெடுத்தாண்ட வேந்தனடி வெல்க
பிறப்பறுக்கும் பிஞ்ஞகன்றன் பெய்கழல்கள் வெல்க
புறத்தார்க்குச் சேயோன்றன் பூங்கழல்கள் வெல்க
கரங்குவிவார் உள்மகிழுங் கோன்கழல்கள் வெல்க
சிரங்குவிவார் ஓங்குவிக்குஞ் சீரோன் கழல்வெல்க 10
ஈச னடிபோற்றி எந்தை யடிபோற்றி
தேச னடிபோற்றி சிவன்சே வடிபோற்றி
நேயத்தே நின்ற நிமல னடிபோற்றி
மாயப் பிறப்பறுக்கும் மன்ன னடிபோற்றி
சீரார் பெருந்துறைநம் தேவ னடிபோற்றி 15
ஆராத இன்பம் அருளுமலை போற்றி
சிவனவன்என் சிந்தையுள் நின்ற அதனால்
அவனரு ளாலே அவன்தாள் வணங்ங்கிச்
சிந்தை மகிழச் சிவபுரா ணந்தன்னை
முந்தை வினைமுழுதும் மோய உரைப்பன்யான் 20
கண்ணுதலான் தன்கருணைக் கண்காட்ட வந்தெய்தி
எண்ணுதற் கெட்டா எழிலார் கழலிறைஞ்சி
விண்ணிறைந்து மண்ணிறைந்து மிக்காய் விளங்கொளியாய்
எண்ணிறந் தெல்லை யிலாதானே நின்பெருஞ்சீர்
பொல்லா வினையேன் புகழுமா றொன்றறியேன் 25
புல்லாகிப் பூடாய்ப் புழுவாய் மரமாகிப்
பல்விருக மாகிப் பறவையாய்ப் பாம்பாகிக்
கல்லாய் மனிதராய்ப் பேயாய்க் கணங்களாய்
வல்லசுர ராகி முனிவராய்த் தேவராய்ச்
செல்லாஅ நின்றஇத் தாவர சங்கமத்துள் 30
எல்லாப் பிறப்பும் பிறந்திளைத்தேன் எம்பெருமான்
மெய்யேஉன் பொன்னடிகள் கண்டின்று வீடுற்றேன்
உய்யஎன் உள்ளத்துள் ஓங்கார மாய்நின்ற
மெய்யா விமலா விடைப்பாகா வேதங்கள்
ஐயா எனஓங்கி ஆழ்ந்தகன்ற நுண்ணியனே 35
வெய்யாய் தணியாய் இயமான னாம்விமலா
பொய்யா யினவெல்லாம் போயகல வந்தருளி
மெய்ஞ்ஞான மாகி மிளிர்கின்ற மெய்ச்சுடரே
எஞ்ஞானம் இல்லாதேன் இன்பப் பெருமானே
அஞ்ஞானம் தன்னை அகல்விக்கும் நல்லறிவே 40
ஆக்கம் அளவிறுதி இல்லாய் அனைத்துலகும்
ஆக்குவாய் காப்பாய் அழிப்பாய் அருள்தருவாய்
போக்குவாய் என்னைப் புகுவிப்பாய் நின்தொழும்பின்
நாற்றத்தின் நேரியாய் சேயாய் நணியானே
மாற்றம் மனங்கழிய நின்ற மறையோனே 45
கறந்தபால் கன்னலொடு நெய்கலந்தாற் போலச்
சிறந்தடியார் சிந்தனையுள் தேனூறி நின்று
பிறந்த பிறப்பறுக்கும் எங்கள் பெருமான்
நிறங்களோ ரைந்துடையாய் விண்ணோர்க ளேத்த
மறைந்திருந்தாய் எம்பெருமான் வல்வினையேன் தன்னை 50
மறைந்திட மூடிய மாய இருளை
அறம்பாவம் என்னும் அருங்கயிற்றாற் கட்டிப்
புறந்தோல்போர்த் தெங்கும் புழுவழுக்கு மூடி
மலஞ்சோரும் ஒன்பது வாயிற் குடிலை
மலங்கப் புலனைந்தும் வஞ்சனையைச் செய்ய 55
விலங்கு மனத்தால் விமலா உனக்குக்
கலந்தஅன் பாகிக் கசிந்துள் ளுருகும்
நலந்தான் இலாத சிறியேற்கு நல்கி
நிலந்தன்மேல் வந்தருளி நீள்கழல்கள் காஅட்டி
நாயிற் கடையாய்க் கிடந்த அடியேற்குத் 60
தாயிற் சிறந்த தயாவான தத்துவனே
மாசற்ற சோதி மலர்ந்த மலர்ச்சுடரே
தேசனே தேனா ரமுதே சிவபுரனே
பாசமாம் பற்றறுத்துப் பாரிக்கும் ஆரியனே
நேச அருள்புரிந்து நெஞ்சில்வஞ் சங்கெடப் 65
பேராது நின்ற பெருங்கருணைப் பேராறே
ஆரா அமுதே அளவிலாப் பெம்மானே
ஓராதார் உள்ளத் தொளிக்கும் ஒளியானே
நீராய் உருக்கியென் ஆருயிராய் நின்றானே
இன்பமுந் துன்பமும் இல்லானே உள்ளானே 70
அன்பருக் கன்பனே யாவையுமாய் அல்லையுமாஞ்
சோதியனே துன்னிருளே தோன்றாப் பெருமையனே
ஆதியனே அந்தம் நடுவாகி அல்லானே
ஈர்த்தென்னை யாட்கொண்ட எந்தை பெருமானே
கூர்த்தமெய்ஞ் ஞானத்தாற் கொண்டுணர்வார் தங்கருத்தின் 75
நோக்கரிய நோக்கே நுணுக்கரிய நுண்ணுணர்வே
போக்கும் வரவும் புணர்வுமிலாப் புண்ணியனே
காக்குமெங் காவலனே காண்பரிய பேரொளியே
ஆற்றின்ப வெள்ளமே அத்தாமிக் காய்நின்ற
தோற்றச் சுடரொளியாய்ச் சொல்லாத நுண்ணுணர்வாய்80
மாற்றமாம் வையகத்தின் வெவ்வேறே வந்தறிவாம்
தேற்றனே தேற்றத் தெளிவேஎன் சிந்தனையுள்
ஊற்றான உண்ணா ரமுதே உடையானே
வேற்று விகார விடக்குடம்பி னுட்கிடப்ப
ஆற்றேன்எம் ஐயா அரனேஓ என்றென்று 85
போற்றிப் புகழ்ந்திருந்து பொய்கெட்டு மெய்ஆனார்
மீட்டிங்கு வந்து வினைப்பிறவி சாராமே
கள்ளப் புலக்குரம்பை கட்டழிக்க வல்லானே
நள்ளிருளில் நட்டம் பயின்றாடும் நாதனே
தில்லையுட் கூத்தனே தென்பாண்டி நாட்டானே 90
அல்லற் பிறவி அறுப்பானே ஓஎன்று
சொல்லற் கரியானைச் சொல்லித் திருவடிக்கீழ்ச்
சொல்லிய பாட்டின் பொருளுணர்ந்து சொல்லுவார்
செல்வர் சிவபுரத்தின் உள்ளார் சிவனடிக்கீழ்ப்
பல்லோரும் ஏத்தப் பணிந்து. 95

నమచ్చివాయ వాఅళ్గ నాదన్తాళ్ వాళ్గ
ఇమైప్పొళుదుం ఎన్నెంజిల్ నీంగాదాన్ తాళ్వాళ్గ
కోహళి యాండ కురుమణిదన్ తాళ్వాళ్గ
ఆహమ మాహినిన్ ఱణ్ణిప్పాన్ తాళ్వాళ్గ
ఏహన్ అనేహన్ ఇఱైవ నడివాళ్గ 5
వేహఙ్ కెడుత్తాండ వేందనడి వెల్గ
పిఱప్పఱుక్కుం పిఞ్ఞహండ్రన్ పెయ్గళల్గళ్ వెల్గ
పుఱత్తార్క్కుచ్ చేయోండ్రన్ పూంగళల్గళ్ వెల్గ
కరంగువివార్ ఉళ్మహిళుఙ్ కోన్కళల్గళ్ వెల్గ
సిరంగువివార్ ఓంగువిక్కుఞ్ సీరోన్ కళల్వెల్గ 10
ఈస నడిబోట్రి ఎందై యడిబోట్రి
తేస నడిబోట్రి సివన్చే వడిబోట్రి
నేయత్తే నిండ్ర నిమల నడిబోట్రి
మాయప్ పిఱప్పఱుక్కుం మన్న నడిబోట్రి
సీరార్ పెరుందుఱైనం తేవ నడిబోట్రి 15
ఆరాద ఇన్బం అరుళుమలై పోట్రి
సివనవన్ఎన్ సిందైయుళ్ నిండ్ర అదనాల్
అవనరు ళాలే అవన్తాళ్ వణఙ్ంగిచ్
సిందై మహిళచ్ చివబురా ణందన్నై
ముందై వినైముళుదుం మోయ ఉరైప్పన్యాన్ 20
కణ్ణుదలాన్ తన్కరుణైక్ కణ్గాట్ట వందెయ్ది
ఎణ్ణుదఱ్ కెట్టా ఎళిలార్ కళలిఱైంజి
విణ్ణిఱైందు మణ్ణిఱైందు మిక్కాయ్ విళంగొళియాయ్
ఎణ్ణిఱన్ దెల్లై యిలాదానే నిన్బెరుంజీర్
పొల్లా వినైయేన్ పుహళుమా ఱొండ్రఱియేన్ 25
పుల్లాహిప్ పూడాయ్ప్ పుళువాయ్ మరమాహిప్
పల్విరుహ మాహిప్ పఱవైయాయ్ప్ పాంబాహిక్
కల్లాయ్ మనిదరాయ్ప్ పేయాయ్క్ కణంగళాయ్
వల్లసుర రాహి మునివరాయ్త్ తేవరాయ్స్
సెల్లాఅ నిండ్రఇత్ తావర సంగమత్తుళ్ 30
ఎల్లాప్ పిఱప్పుం పిఱందిళైత్తేన్ ఎంబెరుమాన్
మెయ్యేఉన్ పొన్నడిహళ్ కండిండ్రు వీడుట్రేన్
ఉయ్యఎన్ ఉళ్ళత్తుళ్ ఓంగార మాయ్నిండ్ర
మెయ్యా విమలా విడైప్పాహా వేదంగళ్
ఐయా ఎనఓంగి ఆళ్ందహండ్ర నుణ్ణియనే 35
వెయ్యాయ్ తణియాయ్ ఇయమాన నామ్విమలా
పొయ్యా యినవెల్లాం పోయహల వందరుళి
మెయ్ఞ్ఞాన మాహి మిళిర్గిండ్ర మెయ్స్చుడరే
ఎఞ్ఞానం ఇల్లాదేన్ ఇన్బప్ పెరుమానే
అఞ్ఞానం తన్నై అహల్విక్కుం నల్లఱివే 40
ఆక్కం అళవిఱుది ఇల్లాయ్ అనైత్తులహుం
ఆక్కువాయ్ కాప్పాయ్ అళిప్పాయ్ అరుళ్దరువాయ్
పోక్కువాయ్ ఎన్నైప్ పుహువిప్పాయ్ నిన్తొళుంబిన్
నాట్రత్తిన్ నేరియాయ్ సేయాయ్ నణియానే
మాట్రం మనంగళియ నిండ్ర మఱైయోనే 45
కఱందబాల్ కన్నలొడు నెయ్గలందాఱ్ పోలచ్
సిఱందడియార్ సిందనైయుళ్ తేనూఱి నిండ్రు
పిఱంద పిఱప్పఱుక్కుం ఎంగళ్ పెరుమాన్
నిఱంగళో రైందుడైయాయ్ విణ్ణోర్గ ళేత్త
మఱైందిరుందాయ్ ఎంబెరుమాన్ వల్వినైయేన్ తన్నై 50
మఱైందిడ మూడియ మాయ ఇరుళై
అఱంబావం ఎన్నుం అరుంగయిట్రాఱ్ కట్టిప్
పుఱందోల్బోర్త్ తెంగుం పుళువళుక్కు మూడి
మలంజోరుం ఒన్బదు వాయిఱ్ కుడిలై
మలంగప్ పులనైందుం వంజనైయైచ్ చెయ్య 55
విలంగు మనత్తాల్ విమలా ఉనక్కుక్
కలందఅన్ పాహిక్ కసిందుళ్ ళురుహుం
నలందాన్ ఇలాద సిఱియేఱ్కు నల్గి
నిలందన్మేల్ వందరుళి నీళ్గళల్గళ్ కాఅట్టి
నాయిఱ్ కడైయాయ్క్ కిడంద అడియేఱ్కుత్ 60
తాయిఱ్ సిఱంద తయావాన తత్తువనే
మాసట్ర సోది మలర్ంద మలర్స్చుడరే
తేసనే తేనా రముదే సివబురనే
పాసమాం పట్రఱుత్తుప్ పారిక్కుం ఆరియనే
నేస అరుళ్బురిందు నెంజిల్వఞ్ సంగెడప్ 65
పేరాదు నిండ్ర పెరుంగరుణైప్ పేరాఱే
ఆరా అముదే అళవిలాప్ పెమ్మానే
ఓరాదార్ ఉళ్ళత్ తొళిక్కుం ఒళియానే
నీరాయ్ ఉరుక్కియెన్ ఆరుయిరాయ్ నిండ్రానే
ఇన్బమున్ దున్బముం ఇల్లానే ఉళ్ళానే 70
అన్బరుక్ కన్బనే యావైయుమాయ్ అల్లైయుమాఞ్
సోదియనే తున్నిరుళే తోండ్రాప్ పెరుమైయనే
ఆదియనే అందం నడువాహి అల్లానే
ఈర్త్తెన్నై యాట్కొండ ఎందై పెరుమానే
కూర్త్తమెయ్ఞ్ ఞానత్తాఱ్ కొండుణర్వార్ తంగరుత్తిన్ 75
నోక్కరియ నోక్కే నుణుక్కరియ నుణ్ణుణర్వే
పోక్కుం వరవుం పుణర్వుమిలాప్ పుణ్ణియనే
కాక్కుమెఙ్ కావలనే కాణ్బరియ పేరొళియే
ఆట్రిన్బ వెళ్ళమే అత్తామిక్ కాయ్నిండ్ర
తోట్రచ్ చుడరొళియాయ్స్ సొల్లాద నుణ్ణుణర్వాయ్80
మాట్రమాం వైయహత్తిన్ వెవ్వేఱే వందఱివాం
తేట్రనే తేట్రత్ తెళివేఎన్ సిందనైయుళ్
ఊట్రాన ఉణ్ణా రముదే ఉడైయానే
వేట్రు విహార విడక్కుడంబి నుట్కిడప్ప
ఆట్రేన్ఎం ఐయా అరనేఓ ఎండ్రెండ్రు 85
పోట్రిప్ పుహళ్ందిరుందు పొయ్గెట్టు మెయ్ఆనార్
మీట్టింగు వందు వినైప్పిఱవి సారామే
కళ్ళప్ పులక్కురంబై కట్టళిక్క వల్లానే
నళ్ళిరుళిల్ నట్టం పయిండ్రాడుం నాదనే
తిల్లైయుట్ కూత్తనే తెన్బాండి నాట్టానే 90
అల్లఱ్ పిఱవి అఱుప్పానే ఓఎండ్రు
సొల్లఱ్ కరియానైచ్ చొల్లిత్ తిరువడిక్కీళ్స్
సొల్లియ పాట్టిన్ పొరుళుణర్ందు సొల్లువార్
సెల్వర్ సివబురత్తిన్ ఉళ్ళార్ సివనడిక్కీళ్ప్
పల్లోరుం ఏత్తప్ పణిందు. 95
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>8====>8101001===>../../isai/08/8101001.mp3

Get the Flash Player to see this player.

முதலாவது குரலிசை: தருமபுரம் ப. சுவாமிநாதன்,
உரிமை: வாணி பதிவகம், கால்வாய் சாலை, திருவான்மியூர், சென்னை 600041
www.vanirec.com

இரண்டாவது குரலிசை: திருத்தணி சுவாமிநாதன்,
உரிமை: வர்த்தமானன், சென்னை 600017
 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

01. తిరువాశకం - సివబురాణం


నమఃశ్శివాయ అను నామము వర్థిల్లాలి!
ఆ నాథుని దివ్య చరణారవిందములు వర్థిల్లాలి!
కనురెప్పపాటుకాలంకూడా నా హృదయమునుండి వైదొలగని ఆ ఈశ్వరుని పుణ్య పాదారవిందములు వర్థిల్లాలి!
కోకళియను క్షేత్రమునందు కొలువైయున్న మాణిక్యమువంటి ఆ గురునాథుని దివ్యపద్మపాదములు వర్థిల్లాలి!
వేదాగములనన్నింటా నిండియుండి మమ్ములను రక్షించు ఆ పరమేశ్వరుని విశిష్ట తామర చరణములు వర్థిల్లాలి!
ఒంటరివాడు, అనేక రూపములై సృష్టియంతటా నిండియుండువాని పాద పద్మములు వర్థిల్లాలి!
ల్లాలి! 5
నా మనోవేగాన్ని నియంత్రించు ఆ మహారాజు దివ్య చరణారవిందములకు విజయీభవ!
జననమరణ వలయమునుండి నన్ను విడిపించు ఆ భవ్య పాదారవిందములకు విజయీభవ!
మనసారా తలచనివారికి అందనంత దూరములోనుండు ఆ ఈశ్వరుని పాదపద్మములకు విజయీభవ!
భక్తితో కైమోడ్పులు సమర్పించువారి మనసులకు ఆనందమునొసగు ఆ రారాజు తామరపద్మములకు విజయీభవ! 10
మహేశ్వరుని మంగళ చరణములకు వందనములు!
మా తండ్రి పాదపద్మములకు వందనములు!
ఆ జ్యొతిస్వరూపుని చరణకమలములకు వందనములు!
వాత్సల్యముతో నిండియుండు ఆ నిర్మలుని పాదారవిందములకు వందనములు!
మాయతో కప్పబడియుండు ఈ జననమరణ వలయమునుండి విదిపించు ఆ చక్రవర్తి తామరవిందములకు వందనములు!
దివ్యమైన పెరుందురై అనబడు క్షేత్రమందు వెలసియున్న మన భగవంతుని విశిష్ట చరణములకు వందనములు! 15
అమితానందమును ప్రసాదించుఎత్తైన శిఖరమువంటి ఆ ఈశునికి వందనములు!
ఆ పరమేశ్వరుడు నా హృదయాంతరములలో నిలిచియుండి
నిరంతరమూ ఎడతెగక తన దయ కురిపించుచుండ,
ఆతడి దివ్య చరణకమలములకు నమస్కరించి
మనసు ఉప్పొంగుటచేత,
సంచిత పాపకర్మములను పోగొట్టుకొనుటకై ఈ శివపురాణమును గానము చేయుచున్నాను! 20
నుదుటనున్న మూడవ నేత్రముతో చల్లని తన కరుణను అందరిపై
ప్రసరింపజేయుటకై అరుదెంచిన ఆ త్రినేత్రుడు
నా తలపులకు అందని సౌందర్యవంతుని దివ్య చరణములకు వందనమొసగి,
భూమ్యకాశములంతట నిండియుండు
జ్యోతిస్వరూపుడవై, సర్వాంతర్యామియై,
హద్దులులేని అఖండుడివైన నీయొక్క దివ్య కీర్తిని
పాపాత్ముడనైన నాకు కొనియాడ తెలియుటలేదు! 25
గడ్డిపోచనై, చెట్టు చేమనై, క్రిమి కీటకానినై, వృక్షమునై,
పలుమృగములనై, పక్షినై, సర్పమునై,
రాతినై, కోతినై, మనుష్యునిగ మారి, దయ్యమునై , భూతమునై,
బలమైన రాక్షసుడినై, మునినై, ఋషినై, దేవతనై,
ఈ మాయాలోకమందున్న ఈ స్థావరజంగమందు 30
ఓ! నాథా! ఇటువంటి పలు జన్మములనెత్తి అలసితిని! సొలసతిని!
సత్యమైన, స్వచ్ఛమైన నీ పాదారవిందములనుగాంచి
విముక్తడయ్యానిప్పుడు!
నా బాగుకొరకు ఓంకార రూపమందు నా హృదయములోనున్న నీవు సత్యవంతుడవు! నిత్యవంతుడవు!
నిర్మలుడవు! వృషభవాహనుడవు!
వేదములన్నియూ నిన్ను ‘అయ్యా!’
అని ఘోషిస్తున్న పరమాణుడవైన నాథుడా! 35
శీతోష్ణస్థితులను ఎన్నటికీ ప్రసాదించు నిర్మలుడవు!
మాయచే కప్పబడు భౌతికపరమైనవన్నింటినీ తొలగించి
నన్ను అనుగ్రహించువాడవు!
ఉన్నతమైన జ్యొతిస్వరూపముగ వెలుగొందుచున్నbr> కాంతిస్వరూపుడవు నీవే!
అఙ్ఞానుడనైన నాకు, ఓ మధురమైన నాథుడా!
నా అఙ్ఞానమును పోగొట్టి సద్బుద్ధిని ప్రసాదించువాడివి!40
ఆదిమధ్యాంత రహితుడవై, విశ్వమంతటినీ
సృష్టించి, రక్షించి, ప్రళయమందు లయమొనర్చి
మమ్మనుగ్రహించువాడవు!
పునఃసృష్టించి, నీ సేవ చేయుటకై నన్ను మరల
జన్మింపజేయువాడవు!
సుగంధ పుష్పపరిమళమువలే నా హృదయాంతరమంతటా
విస్తరించినవాడవు!
మార్పుచెందక, విశ్వమంతతా సుస్థిరంగా నిలిచియుండు
వేదస్వరూపుడవు! 45
అప్పుడే పితికిన పాలలో నేతిని, చెఱకు రసమును కలిపినట్లు,
ఉన్నత శివభక్తుల ఆలోచనలయందు మధురముగ నిండియుండి,
వారిని జననమరణవలయమునుండి తప్పించు నా దైవము!
ఈశానం, తత్పురుషం, అఘోరం, వామదేవం, సద్యోజాతం అనబడు
ఐదు ముఖములు కలిగి, ఐదు వర్ణములతో కూడియుండు
నీవు, దేవాది దేవతలకు కూడ
కానరానివాడవైన నా భగవంతుడవు! 50
చీకటిమయమైయుండు మాయచే కప్పబడు కర్మములనుండి,
మాయకు లోబడి నేనొనరించిన పాపకర్మముల చీకటినంతటినీ తొలగించి,
పుణ్యకర్మమునకులనబడువాటిని,బలమైన త్రాటితో బందించి,
అందమైన బాహ్య చర్మముతో ఈ శరీరమందలి రక్తమాంసములను మూసియుంచి,
దుర్గంధములైన మలములన్నియూ నవ ద్వారములగుండా
వెలికివచ్చునట్లు నీ అదుపాఙ్ఞనలలో ఉండగ
పంచేంద్రియములు వంచనను చేయుచుండ, నిర్మలమైన 55
మృగమయమైయుండు (ఖలునకు నిలువెల్లా విషమను విధముగ)
మనస్సుగలనన్ను, లోపమెరుగని నీ నామములకు ప్రేమను రంగరించి,పలుకుచు, నా హృదయములో
రమించుచుండ, పాపకర్మములు ఒనరించు నావంటివారి
చిరుజన్మముల కొరకు ఈ భువికి అరుదెంచి
మమ్ములను, అనుగ్రహించి నీయొక్క దివ్య పాదారవిందములను
కాన్పరచి, శునకముకంటే హీనమైన వాడినైన నావంటి భక్తులకు,60
మాతృత్వభావనకంటే మిన్నయైన ఆ దైవము,
నిష్కళంకమైన ప్రకాశమొతోకూడియుండు ఆ దివ్య జ్యోతి,
పరిపూర్ణముగ వికసించిన పుష్పమువంటి ఆ భగవంతుడు,
తేజోమయునిగ మధురమైన అమృతమువంటి శివపురమందు వెలసియున్నాడు!
బంధపాశముల ముడులను తెగ్గొట్టు శ్రేష్టమైన వాడు ఆ నాథుడు!
దయతో అనుగ్రహించి మనసులోనున్న వంచనలనన్నింటినీ తొలగించువాడు ఆ ఈశుడు!65
స్వచ్ఛమైన జలముతోనిండియున్న నదివంటి కారుణ్యము కలవాడు!
తనివితీరని మధురమైన అమృతధారవంటి
అనుగ్రహమొనరించువాడు!
హద్దులులేనట్టి విధమున కొలవలేనటువంటి పెద్ద దైవము నీవే!
కొనియాడుచు అనునిత్యమూ తలచు భక్తుల మదిలో
నిరంతరమూ వెలుగుచుండు జ్యోతిస్వరూపుడవు!
సముద్రజలము మేఘములుగ మారి, వర్ష రూపమున, మరల ఆ
సముద్రమునేజేరునట్లు, నా ఆత్మగ నిలిచిచియుండువాడా!
సుఖ, దుఃఖములు లేనివాడవైయుండి, భక్తుల సుఖ, దుఃఖములను గమనించుచుండువాడవు!70
ఉండియూ లేనివానివలే గోచరింపబడుతూ, భక్తులకు
ప్రియమైనవాడివి!
ప్రకాశవంతమైన జ్యోతిస్వరూపుడవు! చిమ్మచీకటి కూడ నీవైయుండు
ఉన్నతమైన వాడవు నీవే!
ఆది, మధ్యాంతరహితుడవైననూ భక్తులను ఎల్లవేళలా
కాపాడుచున్నవాడవు!
అయస్కాంతమువలే వెదకుచూ నన్ను నీవైపుకు ఆకర్షింపజేసుకుని,
రప్పించుకున్నవాడవు! పరిపూర్ణ ఙ్ఞానవంతుల మనసుకు, ఆలోచనలకు కూడ
అందనంతటివాడవు! 75
సూక్ష్మముగ విచారించిననూ వారి బుద్ధికి అందనంతటి సూక్ష్మాతి
సూక్ష్మమంతటి ఙ్ఞానివి నీవు!
పుట్టుట, గిట్టుట, ఆ నడుమ బంధములు లేనటువంటి దివ్యమైన
భగవంతుడవు నీవు!
ఎల్లవేళలా నన్ను కంటికిరెప్పలా కాపాడు కాపాలి! కానరాని పరంజ్యోతి
స్వరూపుడవు!
ఎల్లలులేనట్టి ప్రవాహమువంటి వాడవైన నా తండ్రీ!
విస్తరించియున్న దీపకాంతియై, వివరించలేనటువంటి
మధురానిభూతివైయుండు నాథుడవు! 80
మార్పుకులోబడు ఈ సువిశాల విశ్వమందు విధవిధములైన
మార్గములను తెలియపరచుచు, నా మదిలో నిలిచియున్న ఆ
విశ్వవ్యాపకుడవు నీవే!
ఊరుచుండు ఆ అమృతధారలను నాచే ఆరగింపజేయు నా ప్రభువు నీవే!
పలు విధముల వికారములతో కూడియుండు ఈ శరీరమందలి ప్రాణము నీవైయుండ,
భరించశక్యముకాని ఓ నాథా! ఓ ఈశ్వరా! అని 85
కొనియాడుచు, నీయొక్క కీర్తిని, అసత్యమైనటువంటి ఈ భౌతిక
శరీరమందున్న సత్యమైన నిన్ను తెలుసుకొనగలిగాను!
అటువంటి నన్ను మరల ఈ పుడమిపై జన్మించకుండా నా
కర్మఫలములనన్నింటినీ తొలగించి, మరల అసత్యమైన ఈ భౌతిక
కాయమును ధరింపకనుండునట్లు కట్టడిజేయువాడవు నీవే!
అర్థరాత్రిజామున అలుపెరగక నటనమాడు నాథుడా! (మేము నిద్రావస్థలోయుండగ మమ్ము అనుక్షణమూ కాపాడు దైవము!)
తిల్లైనగరమందు (చిదంబరమందు) నటనమాడు దక్షిణ పాండ్యదేశస్థుడా! 90
‘అయ్యో!’ అని నిరంతరమూ పలికించుచుండు, దుఃఖభరితమైన జన్మలను పోగొట్టువాడా!
చెప్పుటకు వీలుకాని వాడవని చెప్పి, నీ దివ్య చరణములపై
గానముచేసిన ఈ శివపురాణ భావార్థమును గ్రహించి పాడినవారు
ఆ శివపురమందు వెలసియున్న
పరమేశ్వరుని పాదపద్మములందుండ,
అట్టివారిని వినయముతో పలువురు కొనియాడెదరు!95

అనువాదం: సశికళ దివాకర్, విశాఖపట్నం 2023
சிறபி